Namaste NRI

ఎదురు తిరగకపోతే నన్నూ చంపేస్తారు

ఒక నేరాన్ని కనిపెట్టడం కంటే, దాన్ని ఏ యాంగిల్‌లో చూస్తున్నామన్నది ఒక మంచి పోలీస్‌ ఆఫీసర్‌కి ముఖ్యమైన అర్హత అంటున్నారు విశాల్‌. ఆయన కథానాయకుడిగా తు.ప.శరవణన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సామాన్యుడు. డిరపుల్‌ హయాతీ కథానాయిక. ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. టైటిల్‌కు తగ్గట్లుగానే సినిమాలో విశాల్‌ ఓ కామన్‌ మ్యాన్‌గా కనిపించనున్నారు. ఓ క్రైమ్‌ కథను చెప్పిస్తూ విశాల్‌ పాత్రను పరిచయం చేసిన తీరు ఆసక్తి కరంగా ఉంది. తన ప్రాణాలు కాపాడుకునేందుకు వేరే దారిలేక హత్య చేసే వాడికి, మిగతా వాళ్లను చంపి తను బతకాలని అనుకునే వాడికి చాలా తేడా ఉంది.  విభిన్నమైన యాక్షన్‌ డ్రామా కథాంశంతో, ఆద్యంతం ఉత్కంఠ కలిగించేలా సినిమాను తీర్చిదిద్దినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. నేనొక సామాన్యుడిని ఎదురు తిరిగకపోతే నన్నూ చంపేస్తారు అంటూ విశాల్‌ చెప్పడం చూస్తే, అతడు ఎవరిపై పోరాటం చేయాల్సి వచ్చింది? అందుకు కారణాలేంటి? విశాల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ అయ్యాడా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సామాన్యుడు విశాల్‌ నటిస్తున్న 31వ చిత్రం కావడం విశేషం.  ఈ చిత్రానికి చాయాగ్రహణం: కెవిన్‌ రాజా, యువన్‌ శంకర్‌ రాజా స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమా జనవరి 26న ప్రేక్షుల ముందుకు రానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events