Namaste NRI

చరిత కామాక్షి నుంచి చిరు బిడియం లిరికల్ సాంగ్

నవీన్‌ బెత్తిగంటి, దివ్య శ్రీపాద జంటగా నటిస్తున్న చిత్రం చరిత కామాక్షి.  ఈ సినిమాలో చిరు బిడియం మదిలో మోమాటం అనే గీతాన్ని విడుదల చేశారు. ఈ పాటకు మనోహర్‌ పలిశెట్టి సాహిత్య మందించగా చిన్మయి ఆలపించారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ చరిత కామాక్షి పాత్రలో దివ్య శ్రీపాద నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మా సినిమా ఫస్ట్‌ లుక్‌కు మంచి స్పందన వచ్చిందన్నారు.  పాటలో నవీన్‌, దివ్యల కెమిస్ట్రి చూడముచ్చటగా కనిపించింది. ఓ సరికొత్త కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తామన్నారు. మణికంఠ వారణాసి ఓ కీలక పాత్ర చేస్తున్నారు. చందు సాయి దర్శకుడు. రజిని రెడ్డి నిర్మాత అబూ స్వరాలందించారు. ఈ చిత్రానికి కూర్పు కోడాటి పవన్‌ కల్యాణ్‌, ఛాయాగ్రహణం : రాకీ వనమాలి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events