Skip to main content

Namaste NRI

విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకున్న.. అఖండ

బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన అఖండ యాభై రోజులు పూర్తి చేసుకుంది. 103 కేంద్రాల్లో 50 రోజులుగా ప్రదర్శితమవుతూ పేరుకు తగ్గట్టే అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది చిత్రం. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లోని సుదర్శన్‌ థియేటర్‌లో  ప్రేక్షకుల మధ్య యాభై రోజుల వేడుకని నిర్వహించింది. ఈ సందర్భగా బాలకృష్ణ మాట్లాడుతూ  ఇది ప్రేక్షకుల ఇచ్చిన విజయమని అన్నారు. ఈ చిత్రం నేటి నుంచి డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో ప్రసారం కానుంది అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్‌ రెడ్డి,  శిరీష్‌,  స్టంట్‌ శివ, టి.ప్రసన్నకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News