2024లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను మళ్లీ పోటీ చేస్తాననీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. అధ్యక్ష పదవిలో ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా వైట్ హౌస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తన సహచర అభ్యర్థి కమలా హారీస్‌కు మళ్లీ టికెట్ ఇస్తానని స్పష్టం చేశారు. ఆమె తన సహచర అభ్యర్థిని కాకుండా నెంబర్ వన్, నెంబర్ టు కూడా ఆమెనే అని అన్నారు. 2024 నాటి ఎన్నికలకు డెమొక్రాటిక్ పార్టీ టికెట్‌పై పోటీ చేస్తారా అని హారీస్‌కు ప్రశ్నించగా ఆమె కొట్టి పారేశారు. తాము ఈ రోజు గురించే ఆలోచిస్తున్నామని, అందువల్ల ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారని హారిస్ ఎదురు ప్రశ్న వేశారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కూడా కమలనే ఉపాధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉంటారని బైడెన్ స్పష్టం చేశారు.