వాకింగ్‌కి వెళ్తున్నాడన్న కోపంతో భర్తని ఆన్లైన్లో అమ్మకానికి పెట్టింది ఓ మహిళ. న్యూజిలాండ్‌కి చెందిన ఓ మహిళ తన భర్తను ఆన్లైన్లో విక్రయానికి పెట్టింది. తన భర్తకి వాకింగ్‌కి వెళ్లే హాబీ ఉందని, అందుకోసం తనని, పిల్లల్ని వదిలేసి వెళ్లిపోతాడని చెబుతోంది. పైగా అతను పిల్లలను చూసుకోవలసినప్పుడల్లా వాకింగ్‌కి వెళ్లిపోతుంటాడని తెలిపింది. అయితే ఆమెకు తన భర్తతో గడపటం చాలా ఇష్టం అని, కానీ అతనెమో తనకు చెప్పకుండా వెళ్లిపోతాడని వాపోయింది. అందుకే ఈ పని చేస్తానని చెబుతోంది. ఈ మేరకు ఆమె తన భర్త అమ్మకానికి సంబంధించిన ప్రోఫైల్‌ని క్రియేట్ చేసి ఆన్లైన్ ట్రేడిరగ్ సైట్ లో ఉంచింది. పైగా యూజ్డ్ కండిషన్ అనే ట్యాగ్‌ని ఒకటి పెట్టి ప్రకటనలో పొడవు 6 అడుగుల 1 అంగుళం వయసు 37 ఏళ్లు. వృత్తి రీత్యా రైతు. బాగా చూసుకోవడమే కాక నిజాయితీ పరుడు అని పేర్కొంది. అంతేకాదు అతన్ని ఎవరైన కొనుగోలు చేస్తే షిప్పింగ్ ఉచితం అని ఆఫర్ కూడా ప్రకటించింది.