జర్మనీ ప్రభుత్వం విదేశీయులను తమ దేశంలోకి ఆహ్వానించేందుకు నిర్ణయించింది. వ్యత్తిగత నైపుణ్యాలున్న నాలుగు లక్షల మంది విదేశీయులను ఏటా జర్మనీలోకి ఆహ్వానించనున్నట్టు ప్రకటించింది. కార్మికుల కొరత కారణంగా ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తోందని జర్మనీ రాజకీయ నాయకులు ఒకరు తెలిపారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం ఈ ఏడు జర్మనీలో కార్మికుల సంఖ్య 3 లక్షల మేరకు తగ్గిపోతుందని సమాచారం. అయితే జర్మనీ మాత్రమే కాకుండా ఐరోపా ఖండంలోని పలు దేశాలు ఇలాంటి జనాభాపరమైన సమస్య ఎదుర్కొంటున్నాయి. యువజంటలు పిల్లల్ని కనాలంటూ పోప్ ఇటీవలే పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)