Namaste NRI

అమెరికా వైద్యులు మరో ఘనత

అవయవాలకు కొరత ఏర్పడిన పరిస్థితుల్లో సక్సెస్‌ అయిన ఆపరేషన్‌.. కొత్త వైద్య అధ్యాయానికి దారితీయెచ్చని డాక్టర్లు అంటున్నారు. అమెరికా వైద్యులు మరో ఘనత సాధించారు. పంది కిడ్నీలను బ్రెయిన్‌ డెడ్‌ రోగికి అమర్చారు. ఈ ఆపరేషన్‌ విజయవంతం అయినట్టు ప్రకటించారు. అలబామా విశ్వ విద్యాలయానికి చెందిన వైద్యులు జెన్యూ మార్పిడి చేసిన ఓ పంది నుంచి సేకరించిన మూత్ర పండాలను సదరు వ్యక్తికి అమర్చారు. అనంతరం మూడు రోజుల పాటు వాటి పనితీరును పరిశీలించారు. బ్రెయిన్‌ డెడ్‌ అయిన అతని శరీరం పంది మూత్ర పిండాలను తిరస్కరిస్తున్న సంకేతాలు ఏవీ లేవని అలబామా విశ్వవిద్యాలయ వైద్యులు ప్రకటించారు. మూడు రోజులు కిడ్నీలు ఎంతో బాగా పని చేసినట్టు వివరించారు. ఒకదాని తరువాత ఒకటి క్రమ పద్ధతిలో రిహార్స్‌ల్‌ చేపట్టి కిడ్నీ మార్పిడి చేసినట్టు తెలిపారు. పందికి ఉన్న ఎలాంటి వైరస్‌ ఆయనకు సోకలేదని, రక్తంలో పంది కణాలు కూడా ఏమీ కనిపించ లేదని డాక్టర్లు వెల్లడిరచారు.

                        మనుషుల  అవయవాలు అమర్చినట్టే ఆరంభం నుంచి ముగింపు వరకు ఈ చర్య చేపట్టామని, సురక్షితంగా ఈ ప్రక్రియను విజయవంతం చేశామని అలబామా విశ్వ విద్యాలయ వైద్యురాలు జేమీ లాకీ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా అవయవాలకు కొరత ఏర్పడిన నేపథ్యంలో తాజా ప్రయత్నం ఆ సమస్యను పరిష్కరించనుందని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా అవయవాలకు కొరత ఏర్పడిన పరిస్థితుల్లో సక్సెస్‌ అయిన అపరేషన్‌.. కొత్త వైద్య అధ్యాయానికి దారితీయొచ్యని డాక్టర్లు అంటున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events