బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా తల్లయింది. ఈ విషయాన్ని ప్రియాంక, నిక్ జోనాస్ దంపతులు తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో వెల్లడిరచారు. సరోగసీ ద్వారా పసికందుకు తల్లయినట్లు ప్రియాంక వెల్లడిరచింది. తన భర్త నిక్‌ను ట్యాగ్ చేస్తూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టు పెట్టింది. సరోగసీ ద్వారా బిడ్డను కుటుంబంలోకి తీసుకొచ్చినట్లు వెల్లడిరచడానికి చాలా సంతోషిస్తున్నా. మా కుటుంబంపై ఫోకస్ పెడుతున్న ఈ సమయంలో మాకు ప్రైవసీ ఇవ్వాలని మర్యాదగా అడుగుతున్నాం అని ఆమె పోస్టు చేసింది. ప్రియాంక భర్త నిక్ కూడా ఇదే పోస్టును షేర్ చేశాడు.