ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఒమిక్రాన్ వేరియంట్‌తో ప్రపంచ దేశాలు తలలు పట్టుకున్న సమయంలో మరో కొత్త మహమ్మారి ఆందోళనకు గురి చేస్తున్నది. దక్షిణాఫ్రికాలో ఇప్పటికే ఒమిక్రాన్ పురుడు పోసుకుంది. అయితే అక్కడే మళ్లీ ఓ కొత్త వేరియంట్ పుట్టుకొచ్చినట్టు తెలుస్తున్నది. నియోకోవ్ అనే కొత్త రకం వైరస్ గుర్తించినట్టు వూహాన్ శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఒమిక్రాన్ కంటే ఎంతో వేగంగా వ్యాపిస్తుందని చెబుతున్నారు. మరణాల రేటు కూడా ఊహకందని విధంగా ఉంటుందని ప్రకటించారు. ముగ్గురికి నియోకోవ్ వైరస్ సోకితే ఒకరు మృతి చెందే అవకాశాలు ఉన్నాయని వుహాన్ శాస్త్రవేత్తలు తెలిపారు నియోకోవ్ వైరస్‌ను దక్షిణాఫ్రికాలోని ఓ ప్రాంతంలోని గబ్బిలాల్లో గుర్తించారు. ఇది కూడా కరోనా వైరస్ రూపాంతరం అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇది జంతువుల నుంచి జంతువులకు మాత్రే సోకుతుందని మళ్లీ ఇది ఎలా రూపొంతరం చెందుతుందో ఇప్పుడే చెప్పలేమని అన్నారు.