యంగ్ హీరో శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తాజా చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. సకుటుంబ కథా చిత్రమిది. వినోదం, భావోద్వేగాల కలబోతగా మెప్పిస్తుంది. ఆడవాళ్ల ఔన్నత్యాన్ని చాటిచెబుతుంది. శర్వానంద్, రష్మిక మందన్న జోడీ కన్నులపండుగా అనిపిస్తుంది. కుటుంబ ప్రేక్షకులతో పాటు యువతను ఆకట్టుకునే అన్ని అంశాలుంటాయి అని చిత్రబృందం తెలిపింది. ఖుష్బూ, రాధిక శరత్‌కుమార్, ఊర్వశీ, వెన్నెల కిషోర్, రవిశంకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సుజిత్‌సారంగ్, ఎడిటర్: శ్రీకరప్రసాద్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, నిర్మాణ సంస్థ: శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, నిర్మాత: సుధాకర్ చెరుకూరి, దర్శకత్వం: తిరుమల కిషోర్. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)