మనఊరు మన బడి కార్యక్రమంలో ఎన్నారైలను భాగస్వామ్యం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ టీఆర్‌ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాలకు సూచించారు. మంత్రి కేటీఆర్‌తో ప్రగతి భవన్‌లో మహేశ్ బిగాల భేటీ అయ్యారు. తాను చదువుకున్న స్కూల్‌ను కోటీ రూపాయలతో అభివృద్ధి చేయనున్నట్టు మహేశ్ బిగాల ఈ సందర్భంగా మహేశ్ బిగాల తెలిపారు. మంత్రి కేటీఆర్ మహేశ్ బిగాలను అభినందించారు. త్వరలోనే ఎన్నారైలతో కలిసి ఒక జూమ్‌కాల్ ఏర్పాటు చేసి ఎన్నారైలను మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని మంత్రి మహేశ్ బిగాలకు సూచించారు. భేటీ అనంతరం మహేశ్ బిగాల మాట్లాడుతూ తెలుగు మీడియంలో చదువుకొనే విద్యార్థులు తగినంత స్థాయిలో అవకాశాలను అందుకోలేకపోతున్నారన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధనకు సంబంధించి కూడా ప్రత్యేకంగా చట్టాన్ని తీసుకురానున్నారు. ఈ చట్టంతో రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం చదువులు అందుబాటులోకి రానున్నాయని అన్నారు.
తెలంగాణ బిడ్డలు రాష్ట్రములోనే కాకుండా, దేశములో, ప్రపంచములో ఎక్కడైనా పోటీ పరీక్షలకు సిద్ధం అయి వుంటారు. విద్యార్థులకు భాష అడ్డంకి కాకూడదని అన్నారు. తాను చదివిన పాఠశాల, తన ఉరిపై ఉన్న మమకారంతో తాను సైతం ఈ కార్యక్రమంలో భాగస్వామిని కావాలని నిర్ణయించుకున్నాన్నారు. ఇదే విషయాన్ని సీఎం దృష్టికి సైతం తీసకెళ్లాలని ఆయన సైతం అభినందించారన్నారు. రూ.కోటితో కార్పొరేట్‌కు ధీటుగా సకల సదుపాయాలతో తాను చదివిన పాఠశాలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఎన్నారైల తరపున ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆయన ధన్యవాదాలు తెలిపారు.