ఫిలిప్పీన్స్ విదేశీ పర్యాటకులకు శుభవార్త చెప్పింది. వీసా ఫ్రీ ఎంట్రీ ఉన్న 157 దేశాలకు చెందిన పర్యాటకులు ఫిబ్రవరి 10వ తేదీ నుంచి తమ దేశానికి రావొచ్చని ప్రకటించింది. ఆయితే ఆయా దేశాలకు చెందిన పర్యాటకులు తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుని ఉండాలి. ఈ మేరకు ఆ దేశ పర్యాటకశాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. కాగా 157 దేశాల జాబితాలో భారత్‌కు చోటు లేదు. కనుక భారతీయ పర్యాటకులకు ఆ దేశానికి వెళ్లాంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. భారత్‌తో పాటు చైనా, తైవాన్ కూడా లిస్ట్‌ల్ లేవు. తాజా ప్రకటనతో ఆ దేశ పర్యాటక రంగానికి మళ్లీ పూర్వ వైభవం వస్తుందని మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి కార్లో నోగ్రేల్స్ ఆశాభావం వ్యక్తం చేశారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)