భారత ప్రయాణికులకు కెనడా ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కొవిడ్ నిబంధనలను సడలించింది. భారత్ నుంచి నేరుగా లేదా గల్ఫ్, యూరప్, అమెరికా నుంచి వచ్చే ప్రయాణికులకు కొవిడ్ నిబంధనల నుంచి సడలింపు ఇచ్చింది. జనవరి 28 నుంచే ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని వెల్లడిరచింది. దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కరోనా కొత్త వేరియంట్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ క్రమంలోనే కెనడా కూడా కీలక నిర్ణయం తీసుకుంది. కెనడా బయల్దేరడానికి 18 గంటల ముందు కొవిడ్ నెగటివ్ సర్టిఫికెట్‌ను సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇలా చేస్తేనే ప్రయాణానికి అనుమతి ఇస్తామని తేల్చి చెప్పింది. నేరుగా కాకుండా మూడో దేశం మీదగా వచ్చే ప్రయాణికులైతే మార్గమధ్యంలోనే ఎయిర్‌పోర్టులో కూడా నెగెటివ్ సర్టిఫికెట్ తీసుకోవాలని చెప్పింది.
భారత ప్రయాణికులు గల్ఫ్ దేశాల్లోని క్వారెంటైన్ కేంద్రాలకు వెళ్లి అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అయితే తాజాగా కెనడా ప్రభుత్వం ఈ నిబంధనలను సవరించింది. నేరుగా లేదా మూడో దేశం ద్వారా వచ్చే భారత ప్రయాణికులు తమ ప్రయాణికులు తమ ప్రయాణానికి 72 గంటల ముందు కొవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ పొందితే చాలని ప్రకటించింది.