మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగులకు ఒక్కొక్కరికి 1,500 డాలర్ల (రూ.1.12 లక్షలు) ను సింగిల్ టైం బోనస్‌గా ప్రకటించింది. కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ కంటే కింది స్థాయి ఉద్యోగులందరికీ ఈ బోనస్ వర్తిస్తుందని పేర్కొంది. మార్చి 31, 2021కి ముందు ఉన్న ఉద్యోగులందరికీ ఈ బహుమానం ఇవ్వనున్నట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌కు 1,75,508 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరందరి బోనస్ కోసం సంస్థ 200 మిలియన్ డాలర్లు అదనంగా కేటాయించనుంది. కరోనా మహమ్మారి మూలంగా కష్టంగా గడిచిన ఆర్థిక సంవత్సరం ముగిసిన నేపథ్యంలో ఉద్యోగులకు కృష్తికి గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడిరచింది.