Skip to main content

Namaste NRI

మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం

మైక్రోసాఫ్ట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగులకు ఒక్కొక్కరికి 1,500 డాలర్ల (రూ.1.12 లక్షలు) ను సింగిల్‌ టైం బోనస్‌గా ప్రకటించింది. కార్పొరేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కంటే కింది స్థాయి ఉద్యోగులందరికీ ఈ బోనస్‌ వర్తిస్తుందని పేర్కొంది. మార్చి 31, 2021కి ముందు ఉన్న ఉద్యోగులందరికీ ఈ బహుమానం ఇవ్వనున్నట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌కు 1,75,508 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరందరి బోనస్‌ కోసం సంస్థ 200 మిలియన్‌ డాలర్లు అదనంగా కేటాయించనుంది. కరోనా మహమ్మారి మూలంగా కష్టంగా గడిచిన ఆర్థిక సంవత్సరం ముగిసిన నేపథ్యంలో ఉద్యోగులకు కృష్తికి గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడిరచింది.

Social Share Spread Message

Latest News