సుమంత్ హీరోగా మను యజ్ఞ తెరకెక్కిస్తున్న చిత్రం వాల్తేర్ శీను. సుమంత్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఆయన ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. ఇందులో ఆయన విశాఖ పట్నం రౌడీగా కనిపిస్తారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ సుమంత్ కెరీర్‌లో భిన్నమైన చిత్రమిది. రోటీన్కు భిన్నంగా ఉంటుంది. హీరో లుక్కు సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తుందని అన్నారు. త్వరలో వైజాగ్‌లో జరిగే షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి విడుదల తేదీ ప్రకటిస్తాం అన్నారు. మధునందన్, ప్రభ, హైపర్ ఆది కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి నిర్మాత. ఈ సినిమాకి సంగీతం: మార్క్ కె.రాబిన్స్, ఛాయాగ్రహణం: హెచ్. పవన్ కుమార్.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)