ద్రవ్య పరపతి విధానం (ఎంపీసీ)పై ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకున్నది. విశ్లేషకుల అంచనాలకు భిన్నంగా వరుసగా పదోసారి కీలక వడ్డీరేట్లు యథాతథంగా కొనసాగిస్తూ ఆర్‌బీఐ నిర్ణయించింది. ఒమిక్రాన్ నేపథ్యంలో ఆర్థిక రికవరీ ఇంకా పూర్తి కాలేదని, ఇంకా పాలసీ మద్దతు కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశం నిర్ణయించింది. దీని ప్రకారం రెపోరేట్ 4 శాతం, రివర్స్ రెపోరేట్ 3.35 శాతంగా కొనసాగిస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ కోసం ఈసారి కూడా సర్దుబాటు ధోరణినే కొనసాగించనున్నట్లు వెల్లడిరచారు. కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉండచం వరుసగా ఇది పదో సారి కావడం గమనార్హం. 2020 మే నెలలో రెపో రేటును 4 శాతానికి కుదిస్తూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకొంది. నాటి నుంచి అలాగే కొనసాగిస్తూ వస్తోంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)