శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. గురువారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ పూర్తి కుటుంబ కథాచిత్రమిది. ప్రచార చిత్రాలతో పాటు టీజర్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. బిజినెస్‌పరంగా కూడా ఈ చిత్రానికి వచ్చిన బజ్‌తో చాలా హ్యాపీగా వున్నాం. మహిళలే మహారాణులు అని ఈ సినిమా ద్వారా తెలియజెప్పాం. తన కుటుంబంలోని 10 మంది మహిళా సభ్యుల అంగీకారం పొందడం అంత సులభం కాదు. కాబట్టి, పెళ్లికి సరైన అమ్మాయిని వెతకడం అతనికి చాలా కష్టమనిపిస్తుంది. అప్పుడు రష్మిక మందన్న అమ్మాయిని అతను కలుసుకుంటాడు, అన్ని మంచి లక్షణాల భర్తగా అతను ఆమెకు కనిపిస్తాడు. ఈ నెల 25న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. తిరుమల కిషోర్ దర్శకుడు. సుధాకర్ చెకుకూరి నిర్మాత. ఖుష్బూ, రాధికా శరత్‌కుమార్, ఊర్వశి ముఖ్య తారలుగా నటించిన ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: సుజిత్ సారంగ్.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)