హిజాబ్ వివాదంలో తలదూర్చాలని ప్రయత్నించిన పాకిస్థాన్‌కు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ గట్టి వార్నింగ్ ఇచ్చారు. హిజాద్ ధరించిన వారిని విద్యా సంస్థల్లోకి అనుమతించకుండా ముస్లిం బాలికల హక్కులను భారత్ కాలరాస్తోందంటూ పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ వ్యాఖ్యానించడం విదితమే. ఈ వ్యాఖ్యలపై అసుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. యూపీలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఒవైసీ దీనిపై మాట్లాడుతూ మీ పని మీరు చూస్కోండని హెచ్చరించారు. బాలికల విద్యపై భారత్‌కు పాకిస్థాన్ పాఠాలు అవసరం లేదు. మలాలాపై అక్కడ కాల్పులు జరిగాయి. తమ బాలికలకు అక్కడ భద్రత కల్పించడంలో విఫలమైన వారు ఇప్పుడు భారతకు పాఠాలు చెబుతున్నారు అని అసదుద్దీన్ ఒవైసీ ఆక్షేపించారు.