కరోనా సంక్షోభం ముగింపు దశకు ప్రపంచం ఇంకా చేరుకోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ డా. సౌమ్య స్వామినాథన్ అన్నారు. డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ టెడ్రోస్ అథానమ్‌తో కలిసి దక్షిణాఫ్రికాలో వ్యాక్సిన్ తయారీ ప్లాంట్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మరిన్ని కొత్త వేరియంట్లు వచ్చే అవకాశం ఉందని అన్నారు. వైరస్‌లు జన్యుమార్పులను సంతరించుకుంటాయన్న విషయం మనందరికీ తెలిసిందేనన్నారు. మరిన్ని వేరియంట్లు, ఆందోళనకారక వేరియంట్లు పుట్టుకొచ్చే ఆస్కారం ఉందన్నారు. మనం కరోనా ముగింపు దశకు ఇంకా చేరుకోలేదు అని ఆమె వ్యాఖ్యానించారు.