ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న క్వాడ్ సమావేశంపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమను అడ్డుకోవడానికే క్వాడ్ సమావేశం జరిగిందని, ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తే మాత్రం ఈ కూటమి ఎప్పటికీ సక్సెస్ మాత్రం కాలేదని స్పష్టం చేశారు. చైనాకు మోకాలడ్డడానికే క్వాడ్ సమావేశం జరిగిందన్నది మా భావన. ఈ సమావేశానిక్ని ఓ సాధనంగా చేసుకుంటూ మాకు ఆటంకాలు స్పష్టించాలని చూస్తున్నారు. అంతర్జాతీయంగా జరుగుతున్న ఏకీకరణను బలహీనపరచడానికి, కావాలనే ఇలా చేస్తున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)