శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. వాలైంటెన్స్ డే సందర్భంగా ఈ సినిమాలోని ఓ రొమాంటిక్ గీతాన్ని విడుదల చేయబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన ఈ పాట ప్రేమికుల మనోభావాలకు దర్పణంలా ఉంటూ మెలోడీ ప్రధానంగా ఆకట్టుకుంటుందని దర్శకుడు తెలిపారు. ఇటీవలే విడుదల చేసిన టైటిల్ సాంగ్‌కు అద్భుతమైన స్పందన లభిస్తున్నది. ఆడవాళ్ల గొప్పతనాన్ని, త్యాగశీలతను ఆవిష్కరిస్తూ రూపొందిస్తున్న చిత్రమిది. శర్వానంద్, రష్మిక మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. సకుటుంబ చిత్రంగా అలరిస్తుంది అని చిత్ర బృదం పేర్కొంది. ఖుష్బూ, రాధిక శరత్‌కుమార్, వెన్నెల కిషోర్, రవిశంకర్, సత్య, ప్రదీప్‌రావత్, గోపరాజు, బెనర్జీ, కల్యాణీ నటరాజన్, రాజశ్రీనాయర్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : సుజిత్‌సారంగ్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎడిటర్:శ్రీకరప్రసాద్, దర్శకత్వం: తిరుమల కిషోర్. శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరకూరి నిర్మిస్తున్నారు. ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.