కమ్ ఆన్ కళావతి నువ్ లేకుంటే అధోగతి అంటూ సందడి మొదలు పెట్టారు మహేష్ బాబు. ఆయన హీరోగా యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న చిత్రం సర్కారి వారి పాట. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.తమన్ స్వరపరిచిన ఫస్ట్ సింగిల్ కళావతి ప్రోమో ఇటీవల విడుదలై పుల్ సాంగ్ కోసం అందరూ ఎదురు చూసేలా చేసింది. వాలెంటైన్స్ డే రోజున ఈ పాటని విడుదల చేయలనుకున్నారు. శనివారమే ఆన్‌లైన్‌లో బయటికొచ్చింది. దాంతో చిత్రబృందం ఒక రోజు ముందుగానే పాటని విడుదల చేసింది. వాలెంటైన్స్ డే స్పెషల్‌గా ఆదివారం ఈ ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. ఈ పాట ఈ ఏడాది మెలోడీ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. ఈ పాటలో అన్ని ఫర్‌ఫెక్ట్‌గా కుదిరాయి. మహేష్‌బాబు హుక్ స్టెప్ అద్భుతంగా ఉంది. అభిమానుల్లో పండుగ వాతావరణాన్ని నెలకొల్పింది ఈ సాంగ్. మైత్రీ మూవీ మేకర్స్ జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ ఫ్లస్ బ్యానర్ల మీద నవీన్ యెర్నేని, వై రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సర్కారు వారా పాట చిత్రం వేసవి కానుకగా మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)