Namaste NRI

పీఎస్ఎల్వీ-సీ52 ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తొలి ప్రయోగం సక్సెస్‌ అయింది. ఇవాళ ప్రయోగించిన పీఎస్‌ఎల్వీ సీ 52 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. 5 గంటల 9 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లిన వాహన నౌక సక్సెస్‌ ఫుల్‌గా మూడు ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టింది ఇస్రో. 18 నిమిషాల 31 సెకన్లలో శాటిలైట్స్‌ని నిర్ణీత కక్ష్యల్లోకి చేర్చింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా శ్రీహరి కోట నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఈ ఏడాదిలో ఇస్రోకు ఇదే ప్రయోగం.  అలాగే ఇస్రో చైర్మన్‌గా సోమనాథ్‌ బాద్యతలు తీసుకున్నాక ఇది మొదటి ప్రయోగం.  ఇస్రో రేసుగుర్రం పీఎస్‌ఎల్‌వీ వాహనకౌక విజయవంతంగా 54వసారి నింగిలోకి దూసుకెళ్లింది.

                        ఈ సందర్భంగా శాస్త్రవేత్తలకు ఇస్రో చైర్మన్‌ సోమనాథన్‌ అభినందనలు తెలిపారు. శాస్త్రవేత్తల కృషి ఫలించిందని, పీఎస్‌ఎల్‌వీ`సీ 52 రాకెట్‌ ప్రయోగం విజయవంతం అయిందని తెలిపారు. మూడు ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టామని వెల్లడిరచారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events