Namaste NRI

అమెరికా, రష్యాల మధ్య మరో వివాదం ?

ఉక్రెయిన్‌ విషయంలో అమెరికా, రష్యాల మధ్య ఉద్రికత్తలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది. అమెరికాకు చెందిన ఓ జలాంతర్గామి ఉత్తర పసిఫిక్‌ మహాసముద్రంలోని తమ ప్రాదేశీక జిల్లాల్లో ప్రవేశించినట్లు రష్యా ఆరోపించింది. మిలటరీ డ్రిల్స్‌ నిర్వహిస్తున్న సమయంలో తమ యాంటీ` సబ్‌మెరైన్‌ డెస్ట్రాయర్‌ మార్షల్‌ షాపోష్నికొవ్‌ కురిల్‌ దీవుల సమీపంలో అమెరికా నేవీ వర్జీనియా క్లాస్‌ జలాంతర్గామిని గుర్తించినట్లు ఆ దేశ రక్షణ శాఖ తెలిపింది. నీటి ఉపరితలానికి చేరుకోవాలనే తమ ఆదేశాలను విస్మరించడంతో వెంబడిరచగా వెంటనే ఆది వెనక్కి వెళ్లిపోయినట్లు చెప్పింది. రష్యన్‌ ఫెడరేషన్‌ సరిహద్దుల నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంటూ ఈ వ్యవహారాన్ని మాస్కోలోని అమెరికా రాయబార కార్యాలయ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి వివరణ కోరినట్లు రక్షణ శాఖ తెలిపింది. అయితే అమెరికా సైన్యం ఈ ఆరోపనలను కొట్టిపారేసింది. రష్యా వాదనల్లో నిజం లేదని పేర్కొంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events