వెంకటేష్, వరుణ్‌తేజ్ కథానాయకులుగా నటిస్తున్న చిత్రం ఎఫ్`3. తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ కథానాయికలు. ప్రేక్షకులకు మూడిరతల వినోదాన్ని అందించేందుకు రెడీగా ఉన్నాం. డబ్బు చుట్టూ తిరిగే కథ ఇది. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎదురయ్యే ఫ్రస్ట్రేషన్ నుంచి పుట్టే హాస్యం ప్రతి ఒక్కరిని కడుపుబ్బా నవ్విస్తుంది. వేసవిలో కుటుంబమంతా కలిసి చూసే సంపూర్ణ హాస్యరస భరిత చిత్రమిది అని దర్శకుడు తెలిపారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సాయిశ్రీరామ్, ఆర్ట్: ఏ.ఎస్. ప్రకాష్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, అడిషనల్ స్క్రీన్‌ప్లే: ఆదినారాయణ, నారా ప్రవీణ్, నిర్మాణ సంస్థ :శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సహ నిర్మాత: హర్షిత్ రెడ్డి, దర్శకత్వం: అనిల్ రావిపూడి. మే 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.