ప్రభాస్, పూజాహెగ్డే కలిసి నటిస్తున్న రాధేశ్యామ్. పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్నో ప్రత్యేకతలతో రానున్న ఈ చిత్రం పాటలు ఇప్పటికే ప్రజాదరణ పొందాయి. వాలెంటైన్స్ డే సందర్భంగా స్పెషల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. నాయకానాయికల మధ్య చోటుచేసుకునే సరదా రొమాంటిక్ సన్నివేశాలతో గ్లింప్స్ ఆకట్టుకునేలా ఉంది. మళ్లీ లైఫ్‌లో వాడి ముఖం చూడను అంటూ కథానాయిక ప్రేరణ చెప్పిన సంభాషణతో మొదలైన గ్లింప్స్ ఆద్యంతం అలరించేలా సాగింది. బాగా కుక్ చేస్తూ ఇంత మంచిగా మాట్లాడే అబ్బాయికి ఇంకా పెళ్లేందుకు కాలేదో అంటూ విక్రమాదిత్యను ప్రేరణ ప్రశ్నించే సన్నివేశంతో ఆసక్తిగా వీడియోను ముగించారు. దీనికి సైతం అనూహ్యమైన ఆదరణ లభిస్తోందని చిత్ర బృందం అంటోంది. ఈ సినిమా కోసం చాలా మంది సంగీత దర్శకులు పనిచేస్తుండటం విశేషం. జిస్టస్ ప్రభాకరన్, అర్జిత్ సింగ్, మిథున్, అనుమాలిక్ మనస్ భరద్వాజ్, జబిన్ నౌతీయల్, మనోజ్ తదితరుల బృందం సంగీతం అందిస్తోంది. కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్‌ఖేడకర్, ప్రియదర్శి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు వంశీ, ప్రమోద్, ప్రసిధ, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం కె.కె. రాధాకృష్ణకుమార్. మార్చి 11న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుందని చిత్ర నిర్మాతలు తెలిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)