తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను మూడు రోజుల పాటు ఘనంగా జరపాలని టీఆర్‌ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ సంబురాలు జరుపుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు. 50 దేశాల ప్రతినిధులు కరోనా ప్రోటోకాల్స్ పాటిస్తూ ఈ వేడుకలను జరుపుకోవాలని అన్నారు. జన్మదిన వేడుకలను పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, సర్వమత ప్రార్థనలు, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)