చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమా సెట్లో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కరణ జరిగింది. రామ్‌చరణ్ తన మాతృమూర్తి సురేఖకు (ఫిబ్రవరి 18) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్న సెట్‌కు ఆమె వెళ్ళారు. అప్పుడు తీసిన ఫోటో ఇది. తండ్రి కొడులకు ఇద్దరు కామ్రేడ్ దుస్తుల్లో ఉన్నారు. సురేఖ పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులతో దిగిన ఫోటోను రామ్‌చరణ్ పోస్ట్ చేశారు. నా గురించి నీకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. హ్యాపీ బర్త్‌డే అమ్మా అంటూ ట్వీట్ చేశారు. తండ్రి చిరంజీవి, తల్లి సురేఖతో కలిసి ఆచార్య సినిమా సెట్లో దిగిన ఫొటోను సోషల్ మీడియూలో వైరల్ అవుతుంది.
