గత రెండేళ్లుగా మూసివేసిన అంతర్జాతీయ సరిహద్దులను ఆస్ట్రేలియా తెరిచింది. టీకాలు వేయించుకున్న పర్యాటకులకు ఆస్ట్రేలియా స్వాగతం పలికింది. కరోనా ప్రభావం వల్ల ఆస్ట్రేలియాలో గతంలో కఠిన ఆంక్షలు విధించారు. కొవిడ్ ప్రభావం వల్ల ఆస్ట్రేలియాలో దెబ్బతిన్న పర్యాటక రంగాన్ని పునర్ నిర్మించేందుకు పర్యాటకులకు స్వాగతం పలికింది. దీంతో సిడ్నీ నగరానికి రోజుకు 50 కంటే ఎక్కువ అంతర్జాతీయ విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. పర్యాటకులకు ఆస్ట్రేలియా పర్యాటక శాఖ మంత్రి డాన్ టెహన్ స్వాగతం పలికారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)