ఉక్రెయిన్లోని వేర్పాటువాద ప్రాంతాలైన డొనెట్స్క్, లుహాన్స్క్ను రష్యా స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తించడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రెండు ప్రాంతాల్లో ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు. అక్కడ పెట్టుబడులు, వాణిజ్యంపై నిషేధం విధిస్తున్నామని వెల్లడిరచారు. ఈ మేరకు బైడెన్ ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై సంతకం చేశారు. ఉక్రెయిన్, రష్యా ఉద్రిక్తల నేపథ్యంలో అమెరికా జాతీయ భద్రత బృందంతో బైడెన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రష్యా, ఉక్రెయిన్ ఉద్రిక్తతలను అధికారులు ఆయన కు వివరించారు. ఈ సందర్భంగా డొనెట్క్స్, లుహాన్స్క్లకు స్వతంత్ర హోదా కల్పించడం ద్వారా రష్యా అంతర్జాతీయ కట్టుబాట్లాను ఉల్లంఘించిందని బైడెన్ విమర్శించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)