Namaste NRI

ఏఎం రత్నం క్లాప్ తో ప్యాకప్ ప్రారంభం

వాసం నరేశ్‌, ఆశ ప్రమీల హీరో  హీరోయిన్లుగా పరిచయం అవుతోన్న చిత్రం ప్యాకప్‌. జీవీఎస్‌ ప్రణీల్‌ దర్శకత్వంలో పానుగంటి శరత్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం ముఖ్య అతిథిగా హాజరై తొలి సన్నివేశానికి క్లాప్‌ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ సినిమా విజయవంతమై చిత్ర బృందానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను అన్నారు. ఇటువంటి మంచి కథతో హీరోగా పరిచయమవుతున్నందుకు సంతోషంగా ఉంది అన్నారు వాసం నరేశ్‌. ప్రేమలోని మరో కోణాన్ని ఈ సినిమాతో చెప్పాలనుకుంటున్నాం. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా రూపొందిస్తాం. త్వరలోనే రెగ్యులర్‌ చిత్రీకరణకు వెళ్తున్నాం అని జీవీఎస్‌ ప్రణీల్‌ తెలిపారు. ఏకధాటిగా షూటింగ్‌ ప్లాన్‌ చేశాం అన్నారు శరత్‌ రెడ్డి. ఈ చిత్రానికి సంగీతం : సుభాష్‌ ఆనంద్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌ : శ్రీ కృష్ణ గుళ్లపల్లి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events