బ్రిటన్ ప్రధాని బోరిక్ జాన్సన్ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్ విషయంలో రష్యా గనక కఠిన నిర్ణయాలు తీసుకుంటే తమ దేశంలోని రష్యా సంస్థలపై కఠినమైన ఆంక్షలు విధిస్తామని ప్రకటించారు. రష్యాకు చెందిన కీలకమైన ఐదు బ్యాంకులపై ఆంక్షలు విధిస్తామని అధికారికంగా ప్రకటించారు. రోషియా బ్యాంక్, ఐఎస్ బ్యాంక్, జనరల్ బ్యాంక్, ప్రామ్స్‌వ్యాజ్ బ్యాంక్, బ్లాక్ సీ బ్యాంక్ ఈ జాబితాలో ఉన్నాయి. అంతేకాకుండా రష్యాకు చెందిన ముగ్గురు అత్యంత ధనవంతులపై కూడా ఆంక్షలు విధిస్తామని ప్రకటించారు. ఇందుకోసం పార్లమెంట్ నుంచి ప్రత్యేక అధికారాలను కూడా పొందామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో కూడా చెప్పలేమని కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)