దుబాయ్‌కి వెళ్లే ముందు ఎయిర్‌పోర్టులోనే ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలన్న నిబంధనను దుబాయ్ అధికారులు తొలగించారు. ఈ మేరకు దుబాయ్ ఎయిర్‌పోర్టు ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. భారత్‌తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్, దేశీయులకు ఈ కొత్త నిబంధన వర్తించనుంది. కొత్త రూల్స్ ప్రకారం భారతీయులు దుబాయ్ ప్రయాణానికి ముందు కొవిడ్ టెస్ట్ చేయించుకుని నెగెటివ్ ఫలితం వచ్చిన రిపోర్టులను చూపించాల్సి ఉంటుంది. మరో రెండు రోజుల్లో ప్రయాణం ఉందనగా చేయించుకున్న పీసీఆర్ టెస్టును మాత్రమే అధికారులు పరిగణనలోకి తీసుకుంటారు. దుబాయ్ మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు తమ చివరి గమ్యస్థానంలో అమలయ్యే నిబంధనలే దుబాయ్‌లో వర్తిస్తాయని అధికారులు పేర్కొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)