నందమూరి తారకరత్న నటిస్తున్న తాజా చిత్రం సారథి. తారక రత్న పుట్టిన రోజు సందర్భంగా మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ అన్ని వర్గాల మంచి విశేష స్పందన వస్తున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. నిర్మాణంలో అనేక సవాళ్లు అధిగమించి సినిమా పూర్తి చేశామని చిత్ర నిర్మాతలు పేర్కొన్నారు. టీమ్ మొత్తం సహకారంతో ఈ విషయంలో విజయం సాధించామని దర్శకుడు జకట రమేష్ తెలిపారు. నిర్మాతలు పి.నరేష్ యాదవ్, యస్. కృష్ణమూర్తి, సి.సిద్దేశ్వర్ రావు మాట్లాడుతూ ఖో ఖో గేమ్ నేపథ్యంలో ఈ సినిమా తీయడం జరిగింది. ఎక్కువ భాగం సహజమైన లొకేషన్స్‌లో చిత్రీకరించాం. మా సినిమాకు సిద్థార్థ్ వాటికన్ అద్భుతమైన సంగీతం అందించారు అని చెప్పారు.
తారకరత్న, వైశాలి రాజు, కృష్ణమూర్తి, రమాదేవి, నరేష్ యాదవ్, సిద్ధేశ్వరరావు, మారుతీ సాకారం, శీను, మంజు, రాజేష్, జానీ తదితరులు నటించారు. ఈ చిత్రానికి మనోహర్ కొల్లి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. సంగీతం సిద్ధార్థ వాటికన్. స్టంట్స్ కృష్ణ మాస్టర్. ఎడిటింగ్ విజన్ స్టూడియో.