రష్యాతో చర్చలకు సిద్దమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెల్‌న్‌స్కీ ప్రకటించారు. ముందుగా చెప్పినట్లు బెలారస్ వేదికగా కాకుండా సరిహద్దు ప్రాంతంలో పరస్పరం చర్చించేందుకు అంగీకరించారు. ఈ విషయంపై బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో మాట్లాడుతూ చర్చలకు ఒప్పుకున్నట్టు ఉక్రెయిన్ అధ్యక్ష భవనం వెల్లడిరచింది. చర్చలకు రాకుండా ఉక్రెయిన్ నాయకత్వం సమయం వృథా చేస్తోందంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోపించిన కొద్దిసేపటికే ఉక్రెయిన్ నుంచి ఈ ప్రకటన వెలువడం గమనార్హం. బెలారస్‌లోని గోమెల్‌లో రష్యా, ఉక్రెయిన్ మధ్య చర్చలు జరగనున్నాయి. ఉక్రెయిన్ చర్చలకు అంగీకరించినప్పటికీ ఇప్పటికే జరగరాని నష్టం జరిగింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో సహా పలు నగరాలను రష్యా సైనికులు హస్తగతం చేసుకున్నారు. యుద్ధం వల్ల ఉక్రెయిన్‌కు చాలా నష్టం వాటిల్లింది. ఉక్రెయిన్ వాసులు తమ ఇళ్లు వదిలి ప్రాణభయంతో పొరుగు దేశాలకు వలస వెళ్లారు. ఈ పరిస్థితుల్లో చర్చలకు తాము సిద్ధం అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెల్‌న్‌స్కీ ప్రకటించారు.