Namaste NRI

అమెరికా వెళ్లాలనుకునేవారికి గుడ్‌న్యూస్‌..  వ్యక్తిగత ఇంటర్వ్యూలను

అమెరికా వీసా దరఖాస్తుదారులకు  గుడ్‌న్యూస్‌.  కొన్ని రకాల వీసాలకు వ్యక్తిగత ఇంటర్వ్యూల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు అమెరికా తెలిపింది. విద్యార్థులు (ఎఫ్‌, ఎం, అకడమిక్‌ జే వీసాలు), వర్కర్లు (హెచ్‌ 1, హెచ్‌2, హెచ్‌3, వ్యక్తిగత ఎల్‌ వీసాలు), సాంస్కృతిక, పలు రంగాల్లో నిపుణులు (ఓ, పీ, క్యూ వీసాలు) ఇందుకు అర్హులని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడిరచింది. అయితే అభ్యర్థులు గతంలో ఏదైనా ఒక కేటగిరీకి చెందిన అమెరికా వీసా పొంది ఉండాలని, ఒక్కసారి కూడా రిజెక్ట్‌ కాకూడదని, ఎలాంటి అనర్హతలు ఉండొద్దని నిబంధనలు విధించారు. ఈ వీసా దరఖాస్తుదారులకు ఈ ఏడాది డిసెంబర్‌ 31 వరకు ఈ మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది.  వీసా దరఖాస్తుదారులకు ఈ నిర్ణయం ఎంతగానో  ఉపయోగపడుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెస్‌ సలహాదారు అజయ్‌ జైన్‌ భుటోరియా పేర్కొన్నారు.  అమెరికాలో ఏ వీసా జారీకైనా వ్యక్తిగత ఇంటర్వ్యూ తప్పనిసరి. అందులో ఎంపికైతే వీసా మంజూరవుతుంది. అయితే ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఇంటర్వ్యూల నుంచి అగ్రరాజ్యం మినహాయింపు ఇస్తోంది.           

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events