ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రష్యా, ఉక్రెయిన్ బృందాల మధ్య చర్చలు ముగిశాయి. బెలారస్ సరిహద్దులోని గోమెల్ వేదికగా ఇరు దేశాల ప్రతినిధులు సుమారు 4 గంటల పాటు చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ఉక్రెయిన్ నుంచి ఆరుగురు, రష్యా నుంచి ఐదుగురు ప్రతినిధులు పాల్గొన్నారు. నాటోలో చేరే అంశంపై ఇరు దేశాల మధ్య చర్చలు కొలిక్కి రాలేదని తేలింది. నాటోలో ఉక్రెయిన్ చేరకూడదనేది రష్యా ప్రధాన డిమాండ్. కాగా తమ భూభాగం నుంచి రష్యాన్ దళాల ఉపసంహరణ జరగాలనేది ఉక్రెయిన్ ప్రధాన డిమాండ్. రెండు డిమాండ్లు ఇరు పక్షాలను రుచించలేదని సమాచారం. వాస్తవానికి ఇది ముందుగా ఊహించిందే అయినప్పటికీ ఎంతో కొంత ఫలవంతమైన చర్చలు జరగాలని చాలా మంది ఆశించారు. అయితే ఇరు వర్గాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన కారణంగా చర్చలు విఫలమైనట్టు తెలుస్తోంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/modi-300x160.jpg)