రష్యా బలగాలు బాంబులతో విరుచుకుపడుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ దద్దరిల్లిపోతోంది. ఉక్రెయిన్లోని ఖార్ఖీవ్ పట్టణంలో ప్రజల నివాసాలపై కూడా దాడులు జరిగాయి. దీంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఖార్ఖీవ్ పట్టణంలో కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఖార్కివ్ నగరంపై రష్యా దాడులు కొనసాగిస్తూనే ఉన్నది. తాజాగా ఖార్కివ్ పోలీసు బిల్డింగ్పై మిస్సైల్ అటాక్ జరిగినట్లు తెలుస్తోంది. పోలీసు బిల్డింగ్ పూర్తిగా మంటల్లో దగ్గమైనట్లు ఓ వీడియో రిలీజైంది. కరాజిన్ నేషనల్ యూనివర్సిటీలో ఉన్న ఓ బిల్డింగ్ కూడా ధ్వంసమైనట్లు ఆ దేశ కేంద్ర హోంశాఖ వెల్లడిరచింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/modi-300x160.jpg)