ఉక్రెయిన్ మరోసారి భారత్‌ను వేడుకుంది. యుద్దాన్ని ఆపేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడి, సైనిక చర్యను నిలువరించాలని విజ్ఞప్తి చేసింది. రష్యాపై తాజా ఆంక్షలు విధించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కేలభా భారత్ సహా అనేక దేశాల ప్రభుత్వాలను కోరారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని రష్యా ఉల్లంఘిస్తోదని ఆరోపించారు. 30 ఏళ్లుగా ఆసియా, ఆఫ్రికా నుంచి వేలాదిమంది విద్యార్థులకు ఉక్రెయిన్ నివాసంగా ఉంది. యుద్ధం సమయంలో వారిని సురక్షితంగా తరలించడానికి రైళ్లను ఏర్పాటు చేసింది. రాయబార కార్యాలయాలతో కలిసి పనిచేసింది. ప్రస్తుత సంక్షోభంలో ఉక్రెయిన్ ప్రభుత్వం చేస్తున్నది అత్యుత్తమమైన విధి అని కులేబా వివరించారు. ఇదే సమయంలో విదేశీ పౌరులున్న దేశాల నుంచి సానుభూతి పొందేందుకు రష్యా ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/modi-300x160.jpg)