ఉక్రెయిన్ తమకు యూరోపియన్ యూనియన్ (ఈయూ) లో సభ్యత్వం ఇవ్వాలని చాలా రోజులుగా కోరుతోంది. తమకు మద్దతుగా నిలవాలని, ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో తమకు ఈయూ సభ్యత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. అయితే ఈ విషయంలో తొందర పడకూడదని ఈయూ భావిస్తోంది. ఫ్రాన్స్ యూరోపియన్ ఆఫైర్స్ మంత్రి క్లీమెట్ బ్యూన్ ఉక్రెయిన్ సంక్షోభం గురించి చర్చించేందుకు ఈయూ నేతలు ఫ్రాన్స్‌లో కలిసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉక్రెయిన్‌కు ఈయూ సభ్యత్వం ఇవ్వడానికి సమయం పడుతుందని బ్యూన్ అన్నారు. ఈయూలో ఉక్రెయినకు ఫాస్ట్ ట్రాక్ సభ్యత్వం ఇవ్వాలనే విషయంపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమైన చర్చ జరుగుతోందన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/modi-300x160.jpg)