కింగ్ అక్కినేని నాగార్జున నటిస్తున్న చిత్రం ది ఘోస్ట్. ప్రవీణ్ సత్తారు దర్శకుడు. సోనాల్ చౌహాన్ కథానాయిక. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతోంది. నాగార్జున, సోనాల్ చౌహాన్‌తో పాటు ప్రధాన తారాగణం చిత్రీకరణలో పాల్గొంటోంది. సుదీర్ఘంగా సాగే ఈ షెడ్యూల్‌లో కీలకమైన సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నట్టు చిత్రబృందం తెలిపింది. కొన్ని వర్కింగ్ స్టిల్స్‌ని విడుదల చేశాయి సినీ వర్గాలు. నాగార్జున ఇందులో యాక్షన్ ప్రధానమైన పాత్రని పోషిస్తున్నారు. ప్రవీణ్ సత్తారు తన శైలి థ్రిల్లింగ్ అంశాలతో ఒక మంచి యాక్షన్ సినిమాగా రూపొందిస్తున్నారని చిత్ర బృందం తెలిపింది. గుల్‌పనాగ్, అనిఖా సురేంద్రన్ ఈ చిత్రంలో ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ముఖేష్, యాక్షన్: రాబిన్ సుబ్బు, నభా, కళ: బ్రహ్మ కడలి. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కుర్ రామ్‌మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/modi-300x160.jpg)