ఉక్రెయిన్‌లో రష్యా బలగాల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. రష్యా సైన్యం బాంబు దాడులతో బీభత్సం సృష్టిస్తోంది. దీంతో భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికా ఉక్రెయిన్‌కు మరోసారి భారీ సాయం అందించనున్నట్లు కీలక ప్రకటన చేసింది. రష్యా సైనిక దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్న ఉక్రెయిన్‌కు ఐక్యరాజ్య సమితి ఆహార కార్యక్రమం ద్వారా 50 మిలియన్ డాలర్లను మానవతా సాయం కింది అందిస్తున్నట్లు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ప్రకటించారు. భారీగా నష్టపోయిన ఉక్రెయిన్‌కు బెల్జియం, కెనడా, ప్రాన్స్, జర్మనీ, గ్రీస్, పోర్చుగల్, స్పెయిన్, స్వీడన్, నెదర్లాండ్స్, యూకే వంటి దేశాలు ఫైటర్ జెట్స్, యుద్ద సామాగ్రిని అందించాయి.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/modi-300x160.jpg)