రష్యాపై అమెరికా మరికొన్ని ఆంక్షలు అమల్లోకి తీసుకొచ్చింది. రష్యా నుంచి సీఫుడ్, వొడ్కా, డైమండ్స్, దిగుమతిపై నిషేధం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. రష్యా నుంచి పలు రకాల వస్తువుల దిగుమతిపై నిషేధం అమల్లోకి తెస్తూ పలు ఆదేశాలు జారీ చేశారు. తత్ఫలితంగా రష్యా తీవ్ర ఆర్థిక మాంద్యంలోకి కూరుకుపోతుందని అంచనా వేస్తున్నారు. ఉక్రెయిన్‌పై స్పెషల్ ఆపరేషన్ చేపట్టనున్నట్టు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన నేపథ్యంలో అమెరికా, దాని మిత్ర దేశాలు ఈ నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం. మరోవైపు అమెరికా దానీ జీ`7 దేశాలు, యూరోపియన్ యూనియన్ దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటి వరకు రష్యాకు ఉన్న మోస్ట్ ఫేవర్డ్ నేషన్ (అత్యంత సానుకూల దేశం) అన్న హోదాను తొలగించేశాయి. దీనివల్ల రష్యా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలు పెరుగుతాయి.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/modi-300x160.jpg)