రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్ అధ్యక్షుడికి అరుదైన గౌరవం దక్కింది. 2022 నోబెల్ శాంతి పురస్కారానికి జెలెన్స్కీని నామినేట్ చేయాలని మాజీ ప్రస్తుత యూరోపియన్ యూనియన్ రాజకీయ నేతలు నార్వేజియన్ నోబెల్ కమిటీకి లేఖ రాశారు. ఈ కారణంగా నామినేషన్ ప్రక్రియను మార్చి 31 వరకు పొడగించారు. ఈ ఏడాది నోబెల్ బహుమతులును అక్టోబర్ 3 నుంచి 10 వరకు ప్రకటించనున్నారు. నోబెల్ శాంతి బహుమతికి సంబంధించిన ప్రకటన అక్టోబర్ 3`10 తేదీల మధ్య జరగనుంది. 2022 నోబెల్ శాంతి బహుమతి కోసం 92 సంస్థలు, 251 మంది వ్యక్తిగతంగా దరఖాస్తులు చేసుకున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)