ఉక్రెయిన్‌లో పరిస్థితులు చేయిదాటి పోకుండా ప్రపంచ దేశాలు వెంటనే సిద్దం కావాలని భద్రతా మండలిలో ఇండియా తరపున ప్రాతినిథ్యం వహించిన టీఎస్ తిరుమూర్తి కోరారు. ఐక్యరాజ్య సమితిలో ఆయన మాట్లాడుతూ ఉక్రెయిన్ పరిస్థితులు దారుణంగా మారుతున్నాయని, మానవ సంక్షోభం అంచుల్లోకి వెళ్తున్నదని, తాము మాత్రం ఉక్రెయిన్‌కు సాయం అందిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌లో బాంబులు, క్షిపణుల దాడికి బలైన ముప్పు ఎదుర్కొంటున్న కుటుంబాల కోసం ఆత్యవసరంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మానవత్వం, తటస్థం, నిష్పక్ష పాతం, స్వేచ్ఛ ప్రాతిపతికన ఉక్రెయిన్‌లోని ప్రజలకు సహకరించి వారిని ముప్పు నుంచి కాపాడుకోవాలని అన్నారు. ఈ చర్యలను రాజకీయ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. అమాయక ప్రజలు చనిపోతున్నారని, శరణార్థులు, నిరాశ్రయులుగా మారిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా బాంబులు పడుతున్న ప్రాంతాల్లో మానవ జీవన స్థితిగతులు క్షీణించిపోతున్నాయని అన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)