అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన ప్రభుత్వంలో మొదటి నుంచి భారతీయులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో మరో ఇండియన్ అమెరికన్‌కు ఉన్నత బాధ్యతలను అప్పజెప్పారు. ఇండియన్ అమెరికన్ పునీత్ తర్వార్‌ను మొరోకోలో అమెరికా రాయబారిగా నియమించారు. ఈ మేరకు వైట్‌హౌస్ ప్రకటనలో తెలిపింది. పునీత్ తల్వార్ కార్నెల్ యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్‌లో బీఎస్ డిగ్రీ చేశారు. కొలంబియా వర్సిటీ నుంచి అంతర్జాతీయ వ్యవహారాల్లో ఎంఏ పూర్తి చేశారు. శ్వేత సౌధంలోని స్టేట్ డిపార్ట్‌మెంట్‌లో నేషనల్ సెక్యూరిటీ, ఫారెన్ పాలసీ రూపకర్తగా వ్యవహరించిన ఆయన ప్రస్తుతం సీనియర్ అడ్వైజర్‌గా పనిచేస్తున్నారు.
యూఎస్ సెనెట్‌లో ఫారెన్ రిలేషన్స్ కమిటీలో సీనియర్ ప్రొఫెషనల్ స్టాఫ్ మెంబర్‌గా సేవలు అందించారు. గతంలో అధ్యక్షుడికి పొలిటికల్, మిలిటరీ అఫైర్స్‌లో స్పెషల్ అసిస్టెంట్‌గా, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో సీనియర్ డైరెక్టర్‌గా పని చేశారు. పునీత్ ఇప్పుడు మొరాకోలో రాయబారిగా నియమితులయ్యారు.