అమిత్ తివారి, భానుశ్రీ జంటగా రవిచరణ్ తెరకెక్కించిన చిత్రం నల్లమల. తనికెళ్ల భరణి, నాజర్ అజయ్ ఘోష్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్ చిత్ర దర్శకుడ్ని శాలుతో సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోవులను సంరక్షించు కోవాలనే సందేశాన్ని నల్లమల్ల సినిమా ద్వారా ప్రజలకు వివరించిన రవి చరణ్‌ని అభినందిస్తున్నాను. గో సంరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. నల్లమల లాంటి సందేశాత్మక సినిమాలు మరిన్ని రావాలని అన్నారు. అనంతరం హీరో అమిత్ తివారి మాట్లాడుతూ రెండేళ్ల మా కష్టానికి ప్రతిఫలం దక్కిందనుకుంటున్నాం. మంచి కథతో వస్తే ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని మరోసారి నిరూపించారన్నారు. ఈ సినిమా ఇంత బాగా రావడానికి మా నిర్మాతే కారణం. అమిత్ పాత్రకు ఆయన తప్ప మరెవరూ న్యాయం చేయలేరని నా సన్నిహితులు చెబుతున్నారు. చాలా సంతోషంగా ఉంది అన్నారు దర్శకుడు. అన్ని వర్గాల ప్రేక్షకులకి మా సినిమా నచ్చింది. నా మొదటి చిత్రానికే ఇంత ఆదరణ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు రవిచరణ్. ఈ సినిమాకి సంగీతం: పి.ఆర్, ఛాయాగ్రహణం: వేణు మురళి. ఆర్.ఎమ్. నిర్మాత,
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/modi-300x160.jpg)