ఉక్రెయిన్ నటి మరియా ర్యాబోషప్క దక్షిణాది ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. జాతిరత్నాలు సినిమాతో పలువురి దృష్టి ఆకర్షించిన దర్శకుడు అనుదీప్ కేవీ తన తదుపరి చిత్రాన్ని ద్విభాషా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. వరుణ్‌డాక్టర్ సినిమా ద్వారా తెలుగువారికి సుపరిచితమైన తమిళ నటుడు శివకార్తి కేయన్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఉక్రేయినియన్ నటి మరియు ర్యాబోషప్క ఎంపికైంది. ఈ విషయాన్ని చిత్ర బృందం ప్రకటించింది. ఆమె ఇప్పటికే ఉక్రెనియన్ సినిమాల్లో నటించదట. అలాగే ఇండియన్ వెబ్‌సిరీస్‌లో సైతం ప్రధాన పాత్రపోషించిందని వారు తెలిపారు. ఇది శివకార్తికేయన్‌కు 20వ చిత్రం. ఇక చిత్రకథకు నేపథ్యం పాండిచ్చేరి, లండన్ నేపథ్యాల్లో సాగే ఈ చిత్రంలో సత్యరాజ్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. ఇందులో తెలుగు లెక్చరర్ పాత్రలో శివ కార్తికేయన్ కనిపిస్తారని సమాచారం. నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్‌మోహన్ రావు, సురేష్‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. థమన్ స్వరాలు అందిస్తున్నారు. అరుణ్ విశ్వ సహ నిర్మాత.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/modi-300x160.jpg)