Namaste NRI

గాడ్ ఫాదర్ ముంబై షెడ్యూల్ పూర్తి

అగ్ర కథానాయకుడు చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా గాడ్‌ ఫాదర్‌. రాజకీయ నేపథ్య కథతో ఈ చిత్రాన్ని దర్శకుడు మోహన్‌ రాజా తెరకెక్కిస్తున్నారు. మలయాళంలో ఘన విజయం సాధించిన లూసీఫర్‌ రీమేక్‌గా ఈ సినిమా రూపొందుతున్నది. ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ముంబైలో చిత్రీకరణ జరుగుతున్నది. ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌తో పాటుగా, ఓ సాంగ్‌ను కూడా చిత్రీకరించారట. చిరంజీవి, సల్మాన్‌ఖాన్‌ కాంబినేషన్‌ సన్నివేశాలను తెరకెక్కించిన షెడ్యూల్‌ సోమవారంతో పూర్తయింది.  కాగా గాడ్‌ఫాదర్‌ నెక్ట్స్‌ షెడ్యూల్‌ హైదరాబాద్‌లో స్టార్ట్‌ కానుందని సమాచారం. నయనతార, సత్యదేవ్‌, బ్రహ్మాజీ, సునీల్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు.  ఈ చిత్రాన్ని కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events